వాస్తవ సంఘటనతో...

5 Jan, 2019 05:32 IST|Sakshi
రక్షిత్, నక్షత్ర

‘లండన్‌ బాబులు’ ఫేమ్‌ రక్షిత్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్‌. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్‌ కృష్ణ ఫిలింస్‌ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్‌ నిర్మించనున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘చాలా చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన నేను ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడవుతున్నా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోనున్న  తొలి చిత్రం మాదే’’ అన్నారు నిర్మాతలు.  ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: విన్సెంట్‌ అరుల్‌.

మరిన్ని వార్తలు