ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

4 Apr, 2020 21:03 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : సినీ న‌ట‌డు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తోటి న‌టుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఆయనను అభిమానిస్తారు. వారిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌ఎస్ త‌మ‌న్ కూడా ఒక‌రు. కాగా శ‌నివారం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ట్విటర్‌లో తమన్‌ను ఫాలో అయిన‌ట్లు నోటిఫికేష‌న్ రాగానే త‌మ‌న్ ఆనందంతో ఎగిరి గంతేశారు. 'బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఇది. ఈరోజు స్టార్ట్ చేయ‌డానికి ఇంత క‌న్నా మంచి ప‌రిణామం ఏముంటుంది' అంటూ ట్విటర్‌లో పంచుకున్నారు.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విటర్‌లో 34 మందినే ఫాలో అవుతున్నారు. వారిలోనూ ఎక్కువ‌మంది రాజ‌కీయ‌నేత‌లు కాగా తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు సంబంధించి చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌గా తెర‌కెక్కుతున్న వ‌కీల్‌సాబ్ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, అనిరుద్ధ రాయ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్చి 8న మగువా మగువా ఫ‌స్ట్‌సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌కీల్‌సాబ్ సినిమా మే 15న విడుద‌ల చేయాలని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా