పవన్‌ కల్యాణ్‌ ఎంట్రీకి భారీ ప్లాన్‌!

15 Feb, 2020 14:53 IST|Sakshi

‘పింక్‌’ రీమేక్‌తో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే15న విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నాడట. ఇక తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సినీ అభిమానులను ముఖ్యంగా పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు హుషారెత్తిస్తోంది. ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్న పవన్‌ ఎంట్రీ సీన్‌ను భారీగా ప్లాన్‌ చేశారట దర్శకనిర్మాతలు. దాదాపు రెండేళ్ల తర్వాత తెరపై కనిపించనున్న పవర్‌ స్టార్‌ ఎంట్రీ సాదాసీదాగా ఉంటే ఫ్యాన్స్‌కు రుచించదని వారు భావిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. 

భారీ ఫైట్‌ సీన్‌తో పవన్‌ ఎంట్రీ ప్లాన్‌ చేస్తున్నారట చిత్ర బృందం. దీని కోసం దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్రత్యేక సెట్‌ వేయించడాని టాక్‌. వాస్తవానికి పింక్‌ చిత్రంలో అమితాబ్‌ ఎంట్రీ నార్మల్‌గానే ఉంటుంది. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథతో పాటు పాత్రలను కూడా సమూలంగా దర్శకుడు మార్చడంతో ఇలా భారీ ఫైట్‌ సీన్‌కు ప్లాన్‌ కుదిరిందట. కాగా, ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తుండగా.. ఇప్పటికే రెండు మూడు పాటలు కంపోజ్‌ చేసినట్టు సమాచారం. క్రేజీ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌తో ‘సామజవరగమన’రేంజ్‌లో ఓ పాటను పాడించినట్టు టాలీవుడ్‌ టాక్‌. ఇక ఈ చిత్రానికి ‘లాయర్‌ సాబ్‌’అనే టైటిల్‌ పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

చదవండి:
పవన్‌ మరో మూవీ ప్రారంభం

పవర్‌స్టార్‌ సరసన ప్రగ్యా జైస్వాల్‌
చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి​​​​​​​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు