అవి నిజం కాదు

6 Jul, 2020 00:46 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాల్లో ఒక హీరోయిన్‌ గా నటించిన పాయల్‌ ‘సీత’ (2019) చిత్రంలో ఓ స్పెషల్‌సాంగ్‌ చేశారు. లేటెస్ట్‌గా కమల్‌హాసన్‌  ‘ఇండియన్‌  2’, అల్లు అర్జున్‌  ‘పుష్ప’ చిత్రాల్లో ఆమె ప్రత్యేక పాటలు చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై పాయల్‌ స్పందించారు. ‘‘నా గురించి ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ‘ఇండియన్‌  2’, ‘పుష్ప’ చిత్రాల్లో నేను స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి ఇప్పటికింకా అంగీకరించలేదు. ఆ రెండు సినిమాల్లో ప్రత్యేకమైన పాటల్లో నేను నర్తించబోతున్నాననే వార్తలు నిజం కాదు.. కేవలం పుకార్లు మాత్రమే. ప్రస్తుతం నేను ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదు కూడా. ప్రస్తుతానికి చాలా స్క్రిప్ట్స్‌ చదువుతున్నాను. ఏదైనా సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే నేనే చెబుతా’’ అని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారామె.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు