స్పార్క్‌ నా ఎమోషనల్‌ జర్నీ

16 Nov, 2023 04:03 IST|Sakshi
రుక్సార్, విక్రాంత్, హరీష్‌ శంకర్, మెహరీన్, లీలారెడ్డి, సుహాసిని

– విక్రాంత్‌

విక్రాంత్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్‌: ఎల్‌.ఐ.ఎఫ్‌.ఈ’. ఇందులో మెహరీన్, రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్లు. డెఫ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల    అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో   దర్శకులు హరీష్‌ శంకర్, మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని కోరారు.

ఈ వేడుకలో విక్రాంత్‌ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో జరిగిన కొన్ని ఘటనలకు కమర్షియల్‌ అంశాలు జోడించి ‘స్పార్క్‌’ కథ రాసుకున్నాను. నేనే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తానన్నప్పుడు కొందరు వద్దన్నారు. కానీ ఈ సినిమా నా కల. నా కలకు మా కో డైరెక్టర్‌ స్వామిగారి అనుభవాన్ని జోడించి ఈ సినిమాను పూర్తి చేశాను. కొన్ని కష్టాలు పడ్డాను. లీల ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా నాకు పెద్ద ఎమోషనల్‌ జర్నీ’’ అన్నారు విక్రాంత్‌. ‘‘ఈ సినిమాలో  సైంటిస్ట్‌ రోల్‌ చేశాను’’ అన్నారు సుహాసిని. ‘‘సినిమా చూశాను. బాగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లీల. 

మరిన్ని వార్తలు