ఇద్దరు భామలతో ‘ప్రేమ కథా చిత్రం 2’

24 Jun, 2018 10:05 IST|Sakshi

సుధీర్‌ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమకథా చిత్రం. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్‌ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్‌ హీరోగా సీక్వెల్‌ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

హరి కిషన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్‌ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు