ట్రెండీ ప్రేమ పిపాసి

13 Jan, 2020 03:38 IST|Sakshi
సోనాక్షి, జీపీఎస్‌

‘‘ప్రేమపిపాసి’ చిత్రం ట్రైలర్‌ చాలా ట్రెండీగా, ఎంగేజింగ్‌గా ఉంది. ట్రైలర్‌ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సినిమా కూడా అలాగే ఉంటుందన్న నమ్మకం ఉంది. కొత్తవాళ్ల ప్రయత్నం బాగుంది’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. జీపీయస్‌ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి (ఎమ్‌ఆర్‌ ) దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

పి.ఎస్‌.రామకష్ణ (ఆర్‌.కె) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని మారుతి విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రేమ అనేది ఎంతో వాణిజ్యంగా మారిపోయింది. నిజాయతీ ప్రేమను వెతికేవాళ్లు  మా సినిమా చూడొచ్చు’’ అన్నారు మురళీ రామస్వామి అన్నారు. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు పి.యస్‌.రామకష్ణ. జీపీయస్, సహ నిర్మాత రాహుల్‌ పండిట్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్‌ పండిట్, జీఎస్‌ రావు, వై. వెంకటలక్ష్మి, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: యుగంధర్‌ కొడవటి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు