ప్రేమికుల అడ్డా

15 Mar, 2020 05:36 IST|Sakshi
అక్షయ్‌కుమార్, రూప

అక్షయ్‌కుమార్, రూప, కవిత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమికుల అడ్డా’. ‘విడిపోయిన హృదయాలను కలుపుతుంది’ అనేది ఉపశీర్షిక. గేయరచయిత వేల్పుల వెంకటేష్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని వీవీ నాయుడు నిర్మిస్తున్నారు. ‘‘టైమ్‌పాస్‌ ప్రేమికులకు, నిజమైన ప్రేమికులకు మధ్య ఉండే తేడాను మా సినిమాలో చూపించబోతున్నాం. మంచి ప్రేమకథా చిత్రం. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు కెమెరా: శివరామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నూకబోయిన వెంకట్రామ్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా