బయోపిక్‌లో ప్రియదర్శి

24 Oct, 2018 11:07 IST|Sakshi

కమెడియన్‌ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతున్న యువ నటుడు ప్రియదర్శి. యంగ్ హీరోల సినిమాలతో కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్న ప్రియదర్శి త్వరలో ఓ ఆసక్తికర పాత్రలో కనిపించనున్నాడు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఓ బయోపిక్‌లో ప్రియదర్శి లీడ్‌ రోల్‌లో నటించనున్నాడు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం జీవిత కథ ఆధారంగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందించనున్న సినిమాలో ప్రియదర్శి టైటిల్‌ రోల్‌లో నటించనున్నాడు. నేతన్నలకు శ్రమ తగ్గించేలా కొత్త యంత్రాన్ని కనుగొన్న మల్లేశం జీవితాన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా