చిన్న చిత్రాలకు శాశ్వత పరిష్కారం 

1 Jul, 2020 01:00 IST|Sakshi
తుమ్మలపల్లి రామసత్యనారాయణ

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హవా కొనసాగుతోంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలువురు ఈ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నారు. తాజాగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా ‘భీమవరం  టాకీస్‌’ పేరుతో ఒక ఓటీటీ యాప్‌ని తీసుకొస్తున్నాం. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీతో మనం మారుదామంటూ  సినిమా జీనియస్‌ రామ్‌గోపాల్‌ వర్మ ఏటీటీ (ఎనీ టైమ్‌ థియేటర్‌) అనే సరికొత్త మార్గాన్ని వెలికితీశారు. ఈ రంగంలోకి కూడా భీమవరం టాకీస్‌ అడుగుపెడుతోంది. ఏటీటీ వల్ల చిన్న సినిమా విడుదల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చిన్న బడ్జెట్‌ నిర్మాతల కోసం నిర్మాతల మండలి కూడా ఇలాంటి ఓటీటీ యాప్‌ని త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు