ఇటు హారర్ కామెడీ... అటు ప్యూర్ కామెడీ

29 Jun, 2016 22:29 IST|Sakshi
ఇటు హారర్ కామెడీ... అటు ప్యూర్ కామెడీ

‘అల్లరి’ నరేశ్‌ను ‘సీమశాస్త్రి’గా, ‘సీమటపాకాయ్’గా చూపించిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఇప్పుడు ‘ఇంట్లో దెయ్యం.. నాకేంభయం’ అనే హారర్ చిత్రంతో హ్యాట్రిక్ మీద గురిపెట్టారు. బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 23న ప్రారంభమైంది. ఈ హారర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని విజయదశమికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కృతిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: భోగవల్లి బాపినీడు.


కృష్ణభగవాన్ కథతో... ‘అల్లరి’ నరేశ్ పంచ్ డైలాగ్.. కృష్ణభగవాన్ కౌంటర్ డైలాగ్.. భలే కామెడీ కాంబినేషన్ ఇది. కృష్ణభగవాన్‌లో కమెడియన్‌తో పాటు మంచి రచయిత కూడా ఉన్నారు. అందుకు ఓ నిదర్శనం ‘డిటెక్టివ్ నారద’. ఆ సినిమా స్క్రిప్ట్ రాసిందీయనే. కొంత విరామం తర్వాత ‘అల్లరి’ నరేశ్ కోసం కృష్ణభగవాన్ పూర్తి స్థాయి కామెడీ కథ రాశారు. ఈ చిత్రాన్ని శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించనున్నారు. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్‌కృష్ణ దర్శకుడు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి