ఆకాష్‌తో మరో సినిమా

29 Apr, 2018 13:18 IST|Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో పూరికి స్టార్‌ హీరోలు డేట్స్‌ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. అయితే పూరి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆకాష్‌ పూరిని హీరోగా రీ లాంచ్‌ చేస్తూ మెహబూబా షూటింగ్‌ పూర్తి చేశాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. చిత్రయూనిట్ సక్సెస్‌ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

మెహబూబా రిలీజ్‌ కాకముందే మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు పూరి. అంతేకాదు తన తదుపరి చిత్రాన్ని ఆకాష్‌ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్‌. రిలీజ్‌కు రెడీ అవుతున్న మెహబూబా ఇంటెన్స్‌ లవ్‌ స్టోరి కాగా.. నెక్ట్స్ సినిమా మార్షల్‌ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాను కూడా పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ లోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పూరి టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా