డబ్బింగ్‌ చెబుతున్న సూపర్‌ స్టార్‌

26 Dec, 2016 16:48 IST|Sakshi
డబ్బింగ్‌ చెబుతున్న సూపర్‌ స్టార్‌

చెన్నె: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, అగ్రశ్రేణి దర్శకుడు శంకర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్‌ '2.0' నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. సోమవారం నుంచి డబ్బింగ్‌ మొదలు పెట్టారు. హీరో రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ విన్నింగ్‌ సౌండ్‌ డిజైనర్‌ రసూల్‌ పోకుట్టి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  '2.0' డబ్బింగ్ పనుల కోసం చెన్నై వెళుతున్నట్టు ఆయన తెలిపారు.

రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ సైంటిస్ట్‌, చిట్టి రోబో పాత్రల్లో కనిపించనున్నారు. లికా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, సుధాంశు పాండే, ఆదిల్‌ హుస్సేన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో ముంబైలో విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. 2017 దీపావళికి త్రీడీలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి