ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు

23 Oct, 2019 02:20 IST|Sakshi

ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికాగోర్‌ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్‌ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్‌ను హీరోగా యాక్సెప్ట్‌ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్‌ ఫుల్‌ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్‌ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్‌పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను.

వారందరూ సినిమాను చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్‌ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్‌ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్‌ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్‌ ఏర్పడింది అని ఫ్రెండ్స్‌ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్‌. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్‌కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్‌. సంగీత దర్శకుడు షబ్బీర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు