కఠిన క్రమశిక్షణ రామ

4 Jan, 2019 05:15 IST|Sakshi
రామ్‌చరణ్

బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్స్‌ సీన్లు ఎక్కువ. విలన్స్‌ కూడా. మరి వాళ్లను మట్టికరిపించాలంటే హీరో ఎలా ఉండాలి? పిడికిలి బిగిస్తే చొక్కా చినిగేలా కండలు, గుండీలు ఊడిపోయేంత దేహదారుఢ్యం ఉండాలి. ‘వినయ విధేయ రామ’ పోస్టర్స్‌లో, ట్రైలర్‌లో అలాంటి బాడీనే రామ్‌చరణ్‌ చూపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. దానయ్య నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్‌ ఎటువంటి డైట్‌ ఫాలో అయ్యారనే డౌట్‌ ఫ్యాన్స్‌కు కలిగింది. ఆ సందేహాన్ని తీర్చారు చరణ్‌ భార్య ఉపాసన. జిమ్‌ ట్రైనర్‌ రాకేశ్‌ ఉడియార్‌ తయారు చేసిన ఫుడ్‌ చార్ట్‌నే ఫాలో అయ్యారట చరణ్‌.

ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకూ సాగే ఈ డైట్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు త్రీ ఎగ్‌ వైట్స్, రెండు ఎగ్స్, ఓట్స్‌తో పాటు ఆల్మండ్‌ మిల్క్, పదకొండున్నరకు పెద్ద కప్పు వెజిటెబుల్‌ సూప్, మధ్యాహ్నం ఒకటిన్నరకు చికెన్, బ్రౌన్‌ రైస్‌తో పాటు వెజిటెబుల్స్‌ కర్రీ. సాయంకాలం నాలుగంటలకు గ్రిల్డ్‌ ఫిష్, స్వీట్‌ పొటాటో, ఒకటిన్నర కప్పు గ్రీన్‌ వెజిటెబుల్, సాయంత్రం ఆరుగంటలకు గ్రీన్‌ ఫ్రూట్స్‌ సలాడ్‌తో పాటు కొన్ని నట్స్‌ తీసుకోవాలి. కాఫీ, పాల ఉత్పత్తులు, స్వీట్‌ ఎక్కువ కలిగి ఉన్న ఫ్రూట్స్, మద్యానికి స్ట్రిక్‌ నో. ఈ మధ్యలో ఆకలిగా అనిపిస్తే నట్స్, పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు. ఈ డైట్‌ను రామ్‌చరణ్‌ సుమారు 21 రోజులు పాటించారట. అలాగే రాత్రి డిన్నర్‌ టైమ్‌ నుంచి ఉదయం టిఫిన్‌కు సుమారు పన్నెండు గంటలు ఖాళీ కడుపుతోనే ఉన్నారట. ఇంత కష్టతర, కఠిన డైట్‌ను కూడా క్రమశిక్షణతో విధేయంగా పాటించారు కాబట్టే స్క్రీన్‌ మీద విసిల్‌ కొట్టే బాడీతో కనిపించనున్నారు చరణ్‌.

మరిన్ని వార్తలు