వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన

18 Sep, 2014 21:11 IST|Sakshi
వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన
ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని  సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది. 
 
రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు. 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా