ఐస్ క్రీమ్ పై వర్మకు తగ్గని మోజు!

17 Jul, 2014 12:40 IST|Sakshi
ఐస్ క్రీమ్ పై వర్మకు తగ్గని మోజు!
హైదరాబాద్: దర్శకుడు రాంగోపాల్ వర్మకు 'ఐస్ క్రీమ్' విజయాన్ని మజా చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినీ విమర్శకులు, ప్రేక్షకులు ఐస్ క్రీమ్ పై పెదవి విరిచినా.. ఆ చిత్రం లాభాల్ని అందించిన ఉత్సాహంతో వర్మ సీక్వెల్ కు సిద్దమయ్యారు. త్వరలోనే ఐస్ క్రీమ్ 2 చిత్రాన్ని రూపొందిస్తానని మీడియాకు వెల్లడించారు. 
 
సినీ విమర్శకులు ఐస్ క్రీమ్ పై ప్రతికూలంగా స్పందించినప్పటికి..ఇటీవల ఆ చిత్ర సక్సెస్ మీట్ జరుపుకున్నారు. ఇప్పటికే ఐస్ క్రీమ్ 1.5 కోట్లు వసూలు చేసిందని... ఈ వారాంతానికి మరో 80 లక్షలు రావచ్చని అంచనా వేస్తున్నారు. 
 
అంతేకాకుండా భారీగా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోవచ్చని నిర్మాత టి. రామ సత్యనారాయణ అంచనా వేస్తున్నారు. ఐస్ క్రీమ్ లో నటించిన నటీనటులు, టెక్నిషియన్లకు ఎలాంటి పారితోషకం ఇవ్వకుండా.. లాభాలును పంచి ఇస్తామనే ఒప్పందంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు సమాచారం. 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి