రాముడి, కృష్టుడికి 'రామ్ లీలా'కు సంబంధం లేదు: భన్సాలీ

13 Nov, 2013 16:02 IST|Sakshi
రాముడి, కృష్టుడికి 'రామ్ లీలా'కు సంబంధం లేదు: భన్సాలీ
రామ్ లీలా చిత్ర టైటిల్ భారతీయ పురాణం రామ్ లీలాతోకాని, కృష్ణ భగవానుడి 'రాస్ లీలా'తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. రామ్ లీలా చిత్రం విలియమ్ షేక్ స్పియర్ 'రోమియో అండ్ జూలియట్' నవల స్పూర్తితో రూపొందించాను అని తెలిపారు. రాముడికి సంబంధించిగాని, కృష్ట భగవానుడికి కథకు సంబంధించిన చిత్ర కాదని, భారత పురాణాలతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు అని భన్సాలీ అన్నారు. 
 
అశ్లీలంగా, హింసాత్మకంగా, మితీమీరిన శృంగారంతో రామ్ లీలా చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. కావున 15 నవంబర్ తేదిన విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాముడికి సంబంధించిన కథ అని ప్రేక్షకులు రామ్ లీలా చిత్రం చూసే అవకాశం ఉంది అని.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రమాధం ఉంది అని ఢిల్లీ కోర్టులో ఆరుగురు పిటిషన్ దాఖలు చేశారు. 
 
అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసేలా లేవు.. ఎవర్ని అవమానించే రీతిలో కూడా లేవు. మత విశ్వాసాలకు భంగం వాటిల్లదు అని సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు.