త్వరలో బ్యూటిఫుల్‌

5 Dec, 2019 00:11 IST|Sakshi
నైనా

నైనా, సూరి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ట్రిబ్యూట్‌ టూ రంగీలా అనేది చిత్రానికి ఉపశీర్షిక. అగస్త్య మంజు ఈ చిత్రానికి రచన, ఫొటోగ్రఫీతో పాటు  దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్ని టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించగా టి.అంజయ్య సమర్పించారు. టి.నరేశ్‌ కుమార్, టి.శ్రీధర్‌ నిర్మాతలు.  రొమాంటిక్‌ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్‌ లేకుండా సెన్సార్‌ వారు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది.  హీరో హీరోయిన్లు బాగా నటించారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి పాటలు: సిరాశ్రీ. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా