రణ్‌బీర్‌.. కత్రినా ఎన్‌సైక్లోపిడియా

5 May, 2020 19:44 IST|Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ నటించిన సినిమాల్లోని పాత్రల పేర్లను గుక్కతిప్పుకోకుండా చెబుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గతంలో వీరిద్దరూ బి-టౌన్‌లో చెట్టాపట్టేలుసుకు తిరిగిన విషయం తెలిసిందే. ఒకానోక సమయంలో ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం కూడా చేశారు. ఇక వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో జంటగా నటించారు.  వీరు ప్రేమికులుగా నటించిన ‘ఆజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ’, ‘రాజ్‌నీతి’, ‘జగ్గా జాసూస్‌’ చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రి బాగా కుదిరిందంటూ ప్రశంసలను కూడా అందుకున్నారు. కాగా గతంలో కత్రినాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిన రణ్‌బీర్‌ ఓ ఇంటర్యూలో.. కత్రినా ఏఏ దర్శకులతో నటించారు..  ఆ సినిమాల్లో ఆమె నటించిన పాత్రల పేర్లను గబాగబా చెప్పేస్తున్న ఈ వీడియోకు ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. అంతేకాదు వీడియో చివర్లో తనని తాను ‘ఏ కత్రినా కైఫ్‌’ అని కూడా పిలుచుకున్నాడు. (వైరలవుతున్న అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు!)

In this throwback video #RanbirKapoor takes a quiz on how well does he know #KatrinaKaif. Check out how he performs 😀

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘రణ్‌బీర్‌కు కత్రినా అంటే ఎంత ప్రేమో’,  రణ్‌బీర్‌... కత్రినా కైఫ్‌ ఎన్‌సైక్లోపిడియా’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 2010 నుంచి 2016 వరకూ బి-టౌన్‌లో క్యూట్‌ కపుల్‌గా పేరొందిన ఈ  జంట ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం రణ్‌బీర్‌, బాలీవుడ్‌ బ్యూటీ అలీయా భట్‌తో డేటింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం రణ్‌బీర్‌, అలీయాతో కలిసి ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక కత్రినా చివరిగా భరత్‌లో నటించారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సరసన ‘సూర్యవంశీ’లో నటిస్తున్నారు. (ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ)

మరిన్ని వార్తలు