రిలీజ్కు ముందే రజనీ రికార్డ్

8 Mar, 2016 12:50 IST|Sakshi
రిలీజ్కు ముందే రజనీ రికార్డ్

గతంలో రజనీకాంత్ సినిమా అంటే షూటింగ్ కోసమే రెండేళ్లు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కుర్ర హీరోల నుంచి వస్తున్న పోటీ కారణంగా రజనీ కూడా స్పీడు పెంచక తప్పలేదు. కొచ్చాడయాన్ వరకు స్లోగా సినిమాలు చేస్తూ వచ్చిన రజనీకాంత్, లింగా సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాను కేవలం ఐదు నెలల్లో పూర్తిచేసి రికార్డ్ సృష్టించాడు.

ప్రస్తుతం రజనీ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ సినిమాను కూడా కేవలం ఐదు నెలల్లోనే పూర్తిచేశాడు రజనీ. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతుండటం ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తోంది.  లింగా సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. దాదాపు 100 కోట్ల మార్క్ను రీచ్ అయ్యింది. దీంతో పాజిటివ్ టాక్ ఉన్న కబాలి కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పటికే కబాలి సినిమాకు తమిళనాట రూ. 120 కోట్ల వరకు బిజినెస్ జరిగిపోయింది. ఇక విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న రజనీ అక్కడ కూడా భారీ బిజినెస్ను టార్గెట్ చేశాడు. మలేషియా రైట్స్ 10 కోట్లకు, యూఎస్ రైట్స్ 8.5 కోట్లకు, ఆస్ట్రేలియా రైట్స్ 1.5 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇక తెలుగులో కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజనీ, కబాలి బిజినెస్ రూ. 30 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.