అలా ఉండటం అమ్మకు మాత్రమే సాధ్యం

27 Apr, 2018 00:58 IST|Sakshi
సాయిపల్లవి

‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సాయిపల్లవి ‘కణం’  సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ఆర్‌ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన  చిత్రం ‘కణం’. ఈ సినిమా నేడు రిలీజ్‌ అవుతోంది.  ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ–‘‘కణం’ సినిమా ద్వారా ‘ఒకటి ఫీల్‌ అవుతూ మరో ఎమోషన్‌ ఎలా ఎమోట్‌ చేయాలో’ అనే విషయం నేర్చుకున్నాను.

‘ప్రేమమ్‌’లో లవ్, ‘ఫిదా’లో ఇండిపెండెంట్‌ అమ్మాయిగా ఇలా ఒకే షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌ ప్లే చేశాను. ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రకు చాలా షేడ్స్‌ ఉంటాయి. ఆ ఫీలింగ్స్‌ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు కనిపించకుండా ఉండగలగటం కేవలం ‘అమ్మ’కు మాత్రమే సాధ్యం. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందాను అని అనుకుంటున్నాను. ఇలాంటి రోల్స్‌ ఎప్పుడూ వచ్చేవి కావు. దర్శకుడు విజయ్‌ సార్‌ చాలా స్వీట్‌.

నేను ఇప్పటి వరకూ పనిచేసిన దర్శకులు నాకు ఏదో ఒకటి నేర్పించారు. ఇందులో యాక్ట్‌ చేసిన పాప వెరోనికాతో అటాచ్‌మెంట్‌ చాలా పెరిగిపోయింది. ఒకానొక టైమ్‌లో దత్తత తీసుకోవాలన్నంతగా క్లోజ్‌ అయిపోయాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్‌ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే. ‘ఆ పాత్రను చాలా బాగా చేసింది’ అని ఆడియన్స్‌ ఫీల్‌ అయితే చాలు. ఈ సినిమా చూశాక స్క్రీన్‌ మీద ఒక అమ్మను ఆడియన్స్‌ చూడగలిగితే నేను సక్సెస్‌ అయినట్టే’’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు