ఏజెంట్‌ సంతానం?

15 Nov, 2019 04:33 IST|Sakshi

ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) నెల్లూరు బ్రాంచ్‌లో కేసులు సాల్వ్‌ చేశారు ఏజెంట్‌ ఆత్రేయ. ఇప్పుడు ఈ బ్యూరో చెన్నైలో కూడా ఓపెన్‌ కానుందని తెలిసింది. మరి అక్కడి కేసులను ఎవరు సాల్వ్‌ చేస్తారంటే... ఏజెంట్‌ సంతానం అని తెలిసింది. నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన డిటెక్టివ్‌ చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. కామెడీ ఏజెంట్‌గా కితకితలు పెట్టారు నవీన్‌. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రీమేక్‌ కాబోతోందని తెలిసింది. నవీన్‌ పాత్రలో తమిళ హాస్య నటుడు సంతానం కనిపించనున్నారట. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరిన్ని వార్తలు