సెక్షన్‌ 497 నేపథ్యంలో...

26 Jun, 2019 00:29 IST|Sakshi
సాయిదీప్, సీతారామయ్య, అంగనా రాయ్‌

సూపర్‌స్టార్‌ కృష్ణతో ‘శ్రీశ్రీ’, కొత్తవారితో ‘నాటకం’ వంటి సినిమాలు నిర్మించిన సాయిదీప్‌ చాట్ల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’. సందీప్‌ జక్కం ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అంగనారాయ్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమా గుంటూరులో ప్రారంభమైంది. సాయిదీప్‌ చాట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. మన దేశంలో వివాహ వ్యవస్థ రానురాను బీటు వారిపోతోంది.

పాశ్చాత్య ధోరణులు విపరీతంగా పెరిగిపోయి కుటుంబ వ్యవస్థను శాసిస్తున్నాయి. దాంతో యువతీ యువకులు సహజీవనం పేరుతో జీవనాన్ని సాగిస్తూ ఇష్టం లేనప్పుడు ఈజీగా విడిపోతున్నారు. మన సంప్రదాయాలు మరుగుపడిపోకుండా ‘సెక్షన్‌ 497’ అనే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఒకటి ఏర్పాటైంది. ఆ సెక్షన్‌ నేపథ్యంలోనే మా సినిమా ఉంటుంది. ఒక ఎస్పీ అల్లుడు డీఎస్పీని హౌస్‌ అరెస్ట్‌ చేసినప్పుడు జరిగే పరిస్థితుల్ని కథగా రూపొందించాం. జూలై మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభించి, సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేసి, ఆగస్టులో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌కె. బాజి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా