కారులోనే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మళయాల నటుడు 

19 Nov, 2023 10:22 IST|Sakshi

కొచ్చి: పాపులర్‌ మళయాల  నటుడు వినోద్‌ థామస్‌(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.కేరళలోని పంపడిలోని ఓ హోటల్‌లో పార్క్‌ చేసి ఉన్న కారులో ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చాలా సేపటి నుంచి హోటల్‌ ఆవరణలో ఉన్న కారులో ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు హోటల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు  వచ్చి చూశామని పోలీసులు చెప్పారు. 

హోటల్‌కు చేరుకున్న వెంటనే కారులో పడి ఉన్న వినోద్‌ థామస్‌ను ఆస్పత్రికి తరలించామని, అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పోలీసులు తెలిపారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్‌ మార్టంకు పంపించామన్నారు. 

అయ్యప్పనుమ్‌ కోష్యుమ్‌, నథోలి, ఒరు చెరియ మీనల్ల, ఒరు వంత్‌ పాతాయా, హ్యాప్పీ వెడ్డింగ్, జూన్‌ లాంటి పాపులర్‌ సినిమాల్లో వినోద్‌ థామస్‌ నటింంచారు. ఇందులో అయ్యప్పనుమ్‌ కోష్యుమ్‌ అనే చిత్రం తెలుగులో భీమ్లానాయక్‌ పేరుతో రీమేక్‌ చేశారు.

ఇదీచదవండి.. ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’

మరిన్ని వార్తలు