తొక్కితే 500 స్పీడులో...

18 Sep, 2017 01:07 IST|Sakshi
తొక్కితే 500 స్పీడులో...

వెళ్లాలంతే! ఎక్కడికి? బాక్సాఫీస్‌ లెక్కల్లో మరింత ముందుకి! ధూమ్‌... ధూమ్‌... మంటూ సిల్వర్‌ స్క్రీన్‌ రోడ్డుపై పైపైకి! ధూమ్‌... హిందీలో సూపర్‌హిట్‌ ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో మూడు సిన్మాలొచ్చాయి. మూడూ హిట్టే. ‘ధూమ్‌’కి 100 కోట్ల వసూళ్లొస్తే, ‘ధూమ్‌–2’కి 150 కోట్లొచ్చాయి. ఇక, ఆమిర్‌ఖాన్‌ హీరోగా వచ్చిన ‘ధూమ్‌–3’ అయితే 550 కోట్లకు పైగా వసూలు చేసింది.

అందువల్ల రీసెంట్‌గా కలెక్షన్ల రేసులో కాస్త వెనకబడిన షారూఖ్‌ ఖాన్‌ ‘ధూమ్‌–4’తో మళ్లీ రేసులోకి రావాలనుకుంటున్నారట! ఆల్రెడీ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత, క్లోజ్‌ ఫ్రెండ్‌ ఆదిత్యా చోప్రా కూడా షారూఖ్‌ ‘ధూమ్‌–4’ చేస్తే బాగుంటుందని, హీరోతో డిస్కస్‌ చేశారని బీటౌన్‌ టాక్‌! ధూమ్‌ అంటేనే హైఎండ్‌ బైకులకు, రేసీ చేజింగ్‌ ఫైట్స్‌కి ఫేమస్‌. షారూఖ్‌ అవన్నీ చేస్తే ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు!!