ఆమెకి అతనే విలన్!

24 Jan, 2016 23:58 IST|Sakshi
ఆమెకి అతనే విలన్!

 ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’,‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’ తదితర చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు శివాజీ. కొంత విరామం తర్వాత ఆయన అంగీకరించిన చిత్రం ‘షీ’. ఈ చిత్రంలో శివాజీ నెగటివ్ రోల్ చేయడం విశేషం. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతనా ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై  కల్వకుంట్ల తేజేశ్వర్ రావు(కన్నారావ్) ఈ  చిత్రం నిర్మిస్తున్నారు.
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 15కు ఈ షెడ్యూల్ పూర్తి చేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంటుంది. ఓ పాటను బెల్జియంలో చిత్రీకరిస్తాం. తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ ఇందులో ఓ పాట పాడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘కొంచెం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. ఇందులో నెగటివ్ రోల్‌తో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా’’ అని శివాజీ అన్నారు. దర్శకుడు రమేష్, శ్వేతామీనన్, దీక్షా పంత్ తదితరులు కూడా మాట్లాడారు.