అప్పుడు ‘దొరసాని’.. ఇప్పుడు ‘విధివిలాసం’

20 Jan, 2020 15:24 IST|Sakshi

నూతన దర్శకుడు దుర్గానరేశ్‌ గుట్ట డైరెక్షన్‌లో రొమాంటిక్‌ హీరో అరుణ్‌ అదిత్‌, ‘దొరసాని’ ఫేమ్‌ శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విధివిలాసం’. శివదినేశ్‌ రాహుల్‌, అయ్యర్‌ నకరకంటితో పాటు ఎస్‌కేఎస్‌ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్‌లోని ఓ ఆలయంలో పూజాకార్యక్రమాల అనంతరం ఈ సినిమాను ప్రారంభించారు. జీవితా రాజశేఖర్‌ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందించగా.. డైరెక్టర్‌ దశరథ్‌ గౌరవ దర్శకత్వం వహించాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ క్లాప్‌ కొట్టగా.. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశాడు. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, సత్య, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభంకానుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

ఇక ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన శివాత్మిక.. తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా అంతగా సక్సెస్‌ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 24 కిస్సెస్‌ చిత్రంతో అరుణ్‌ అదిత్‌ రొమాంటిక్‌ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా రాజశేఖర్‌ ‘గరుడవేగ’ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఓ రకంగా చెప్పాలంటే హీరోహీరోయిన్లుగా వీరిద్దరికి ఇది రెండో సినిమా. మరి ద్వితీయ విఘ్నాన్ని వీరు అధిగమిస్తారో లేదో చూడాలి.

చదవండి: 
దొరసాని’ మూవీ రివ్యూ
హృదయాలను గెలుచుకున్న పూజా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

సినిమా

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!

అప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌!

సరోజినీ నాయుడుగా...

వైరసవత్తరమైన సినిమాలు

పిల్ల‌ల‌తో క‌లిసి విరాళ‌మిచ్చిన బాలీవుడ్ న‌టి

ప్రేమ‌ప‌క్షులు..ఇప్పుడు ఇంట్లోనే ఆనందంగా