16 భాషల్లో సిల్క్‌స్మిత జీవితకథ

4 Aug, 2013 14:07 IST|Sakshi
16 భాషల్లో సిల్క్‌స్మిత జీవితకథ

నటి సిల్క్‌స్మిత జీవిత చరిత్ర చాలా ప్రాచుర్యం పొందింది. శృంగారతారగా ఆమె దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో రాణించారు. అయితే అర్ధాంతరంగా కన్నుమూశారు. సిల్క్‌స్మిత జీవిత ఇతివృత్తంతో బాలీవుడ్‌లో ది దర్టీ పిక్చర్ పేరుతో రూపొందిన చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె పాత్రను పోషించిన విద్యాబాలన్ జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

సిల్క్ జీవిత కథతో ఇటీవల మలయాళంలో క్లైమాక్స్ పేరుతో మరో చిత్రం తెరకెక్కింది. స్మిత పాత్రను సానాఖాన్ పోషించింది. ఈ చిత్రం తమిళంలో ఒరునడిగైయిన్ డైరీ పేరుతో అనువాదం అయింది. తాజాగా కన్నడంలో సిల్క్ జీవిత కథతో సిల్క్ సక్కత్ మగ పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది.

ఇందులో పాకిస్తాన్ నటి వీణామాలిక్ నటిస్తోంది. త్రిసూల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 16 భాషలలో అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారని త్రిసూల్ తెలిపారు.