Rajinikanth And Silk Smitha Rumoured Love Story: రజనీకాంత్‌ వల్ల సిల్క్‌ స్మిత ఇన్ని ఇబ్బందులు పడిందా.. వారిద్దరి మధ్య ఇదే నిజమా?

25 Sep, 2023 14:01 IST|Sakshi

ఒకప్పుడు వెండితెరను ఏలిన సౌందర్య రాశి సిల్క్ స్మిత.. ఆమె మరణించి ఇప్పటకి సరిగ్గా 27 ఏళ్లు పూర్తి అయ్యాయి. సిల్క్ స్మిత 80వ దశకంలో తన పెద్ద కళ్లతో, మనోహరమైన చిరునవ్వుతో, ఆవేశపూరితమైన అందంతో దక్షిణ భారత చలనచిత్ర ప్రపంచాన్ని తుఫానుగా మార్చేసిందని చెప్పవచ్చు. 80, 90 దశకాల్లో స్మిత పాటలు లేని సినిమాలు చాలా అరుదు. సిల్క్ స్మిత తన 17 ఏళ్ల నట జీవితంలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించింది.

సినిమా కథ కంటే ఎక్కువగా స్మిత నిజ జీవితంలో ఎక్కువ కష్టాలు ఉండేవి. నిర్మాతగా మారి సినిమాలు కూడా ఆమె తీశారు. కానీ ఆ రంగంలో పరాజయాలు అందుకోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడం.. ప్రేమ వ్యవహారం దెబ్బతినడంతో తట్టుకోలేకపోయారు. 1996లో (అప్పటికి 35 ఏళ్ల వయసు) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆమె మరణానికి పూర్తి కారణాలు ఇప్పటికీ తెలియవు.

గ్లామరస్‌లో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు
సౌత్ ఇండియాలో పాపులారిటీ విషయంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లతో పోటీ పడింది సిల్క్ స్మిత. అప్పట్లో ఈ నటిపై చాలా గాసిప్స్‌ చక్కర్లు కొట్టాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, నటి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ప్రేమలో ఉందనే వార్త అప్పట్లో పెద్ద సంచలనం క్రియేట్‌ చేసింది. సిల్క్ స్మిత 80వ దశకంలో కమల్‌హాసన్‌తో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రలు చేయడంలో సిల్క్‌ను మించిన నటి మరోకరు లేరు. సిల్క్ అనేక బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించింది.

సిల్క్‌ శరీరంపై సిగరెట్‌ మచ్చలు
రజనీకాంత్, సిల్క్ 1983లో జీత్ హమారీ, 1983లో తంగా మగాన్, పాయుమ్ పులిలో కలిసి పనిచేశారు. అదే సమయంలో, ఈ చిత్రాలలో సిల్క్ యొక్క ఆకర్షణీయమైన డ్యాన్స్‌ అప్పట్లో పలు వివాదాలకు దారితీసింది. రజినీ, సిల్క్ ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు సిల్క్ స్మిత శరీరంపై రజనీకాంత్ సిగరెట్‌తో కాల్చాడని కూడా ఆనాడు భారీగానే రూమర్స్‌ వచ్చాయి. అప్పట్లో వారిద్దరి గురించే ప్రతి సినిమా సెట్‌లో పలురకాలుగా చర్చించుకునే వారు. 

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియరాలేదు. వారిద్దరూ కలిసి పలు రొమాంటిక్‌ సాంగ్స్‌లలో నటించినందుకే ఈ రూమర్స్‌ వచ్చాయని మరికొందరు చెప్పుకునేవారు. సిల్క్‌ స్మిత 1996 సెప్టెంబర్‌ 23న మరణించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత విశాల్‌ 'మార్క్ ఆంటోని' చిత్రంలో స్మిత మాదిరి తమిళ నటి విష్ణుప్రియా గాంధీ కనిపించింది. మేకప్‌ సాయంతో ఆమెను అచ్చూ సిల్క్‌ మాదిరే తెరపై చూపించారు. దీంతో ఆమెకు సంబంధించిన పాత విషయాలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు