అలా జరిగితే నన్ను క్షమించండి: సోనూసూద్‌

28 May, 2020 11:24 IST|Sakshi

ముంబై : కొన్ని వేల మంది వలస కార్మికులకు సహాయం అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు బాలీవుడ్‌ స్టార్‌ సోనూసూద్‌. లాక్‌డౌన్‌లో ముంబైలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను స్వంత ప్రదేశాలకు చేరుస్తున్నారు. తన సొంత ఖర్చుతో బస్సులను ఏర్పాటు చేసి వలస జీవులను సొంత రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, బీహార్‌లకు అనేక మంది కార్మికులను చేరవేశారు. అదే విధంగా పంజాబ్‌లోని వైద్యులకు పిపిఈ కిట్లు కూడా అందించిన సంగతి తెలిసిందే. ఇక ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్‌ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. (సోనూసూద్‌.. నువ్వు రియల్‌ హీరో)

తాజాగా బస్సు సేవల కోసం టోల్‌ ఫ్రీం నెంబర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎవరికైనా సహాయం కావాలంటే ఈ నెంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు. సహాయం కోసం ఎంతో మంది సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ను సంప్రదిస్తున్నారు. వీరిలో చాలా మందికి వ్యక్తిగతంగా స్పందించి వారికి భరోసా ఇస్తున్నాడు. అయితే కొంతమంది వింతైన ప్రశ్నలు వేసినప్పటికీ ఏమాత్రం విస్కుకోకుండా వారందరికీ ఈ బాలీవుడ్‌ హీరో అదిరిపోయే సమాధానాలు ఇస్తున్నారు. తాజగా సోనూసూద్‌ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తన మొబైల్‌ నోటిఫికేషన్‌ బార్‌ను వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. (గర్ల్‌ ఫ్రెండ్‌ను కలవాలంటూ నటుడికి ట్వీట్‌!)

ఈ వీడియోలో ఫోన్‌ స్క్రీన్‌ ఆన్‌ చేయగానే తమకు సహాయం చేయాలని ఎంతో మంది నుంచి అభ్యర్థనలు వేగంగా వచ్చి పడుతున్నాయి.‘మీ సందేశాలు ఇంత వేగంతో మాకు చేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి సాయం చేసేందుకు నేను. నా బృందం మా వంతుగా తప్పని సరిగా ప్రయత్నిస్తాం. ఒకవేళ ఇందులోని కొన్ని అభ్యర్థనలను నేను తీర్చలేకపోతే నన్ను క్షమించండి అంటూ’ ట్వీట్‌ చేశారు. ఇక వీడియో షేర్‌ చేసిన కొన్ని క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (ఆమె లేకుండా ఇంట్లో పని చేయగలరా! )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా