దర్శక–నిర్మాత రసూల్‌!

17 Feb, 2019 06:39 IST|Sakshi

సౌత్‌ అండ్‌ నార్త్‌ సినిమాలే కాకుండా కొన్ని హాలీవుడ్‌ సినిమాలకు సైతం వర్క్‌ చేశారు సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌. 2009లో వచ్చిన ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను సౌండ్‌ మిక్సింగ్‌ విభాగంలో రసూల్‌కు ఆస్కార్‌ అవార్డు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రసూల్‌ దర్శకుడిగా మారనున్నారని సమాచారం. ‘రంగ్‌ దే బసంతి, ఢిల్లీ 6’ చిత్రాలకు కథ అందించిన  కమల్‌పాండే ఈ సినిమాకు కథ రాస్తున్నారట. ఓ హాలీవుడ్‌ స్టూడియోతో కలిసి రసూల్‌ ఈ సినిమాను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు