రియల్‌ లైఫ్‌లో ఫుల్‌ క్లారిటీ

6 Dec, 2017 00:51 IST|Sakshi

‘‘అప్పట్లో ఒకడుండేవాడు’ రిలీజ్‌ టైమ్‌లో నిర్మాత రాజ్‌ కందుకూరి దర్శకుడు వివేక్‌ను నా వద్దకు పంపారు. మొదటి 10 నిముషాల కథ వినగానే ‘మెంటల్‌ మదిలో’ చిత్రానికి ఓకే చెప్పేశా’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు.శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి నిర్మించిన ‘మెంటల్‌ మదిలో’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ...

► ఈ చిత్రంలో ప్రతి విషయానికీ కన్‌ఫ్యూజ్‌ అయ్యే పాత్ర నాది. కానీ, రియల్‌ లైఫ్‌లో సరైన నిర్ణయాలు తీసుకుంటా. నాకు ఏది సరిపోతుందో దాన్నే ఎంచుకుంటా. కథ బాగుండీ నాకు సెట్టవ్వకపోతే చేయను. అదే నా పాలసీ. మా చిత్రాన్ని ఫస్ట్‌ చూసింది నారా రోహితే. చాలా బాగుందన్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ డబ్బులు వచ్చింది ‘మెంటల్‌ మదిలో’ చిత్రానికే.

► ఇది రెగ్యులర్‌ స్టోరీ కాదు. స్క్రీన్‌ప్లేలో చిన్న మ్యాజిక్‌ ఉంటుంది. ఇందులో నచ్చకపోవడానికి ఏమీ ఉండదు. సింపుల్‌గా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా నచ్చేసింది. నాకు, శివాజీరాజాగారికి మధ్య వచ్చే సీన్లు, హీరోయిన్లతో నా లవ్‌ ట్రాక్స్‌ ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్‌ చేశాయి.
     
► కథలో నేను ఒక్కడినే మార్పులు చెప్పను. అందరం చర్చించుకున్నాక అవసరమైన మార్పులు.. చేర్పులు చేసుకుంటుంటాం. దర్శకులు చెప్పిన కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తా.
     
► నా తాజా సినిమా ‘నీది నాది ఒకే కథ’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘సుర’ డైరెక్టర్‌ విజయ్‌తో ‘తిప్పరా మీసం’ సినిమా చేస్తున్నా. ‘వీర భోగ వసంతరాయలు’ కూడా చిత్రీకరణలో ఉంది.

మరిన్ని వార్తలు