‘తిప్పరా మీసం’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

6 Feb, 2019 11:57 IST|Sakshi

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు, ఈసారి రూటు మార్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అసుర సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాతో నిక్కి తంబోలి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్న ఈసినిమాకు సిధ్‌ సినిటోగ్రాఫర్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు