శ్రీముఖి.. మైమరచి

30 Dec, 2019 08:53 IST|Sakshi

బుల్లితెర నటి శ్రీముఖి తళుక్కుమంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం అనంతకు విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అభిమాన తారను చూసి మైమరచిపోయారు. పూలబొకేలిచ్చి.. ఆటోగ్రాఫ్‌లు తీసుకుని సంబరపడిపోయారు.

అనంతపురం న్యూసిటీ: బెంగళూరు హైవేలో ఆదివారం హోటల్‌ బ్లిస్‌ ఆనంద్‌ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్య క్రమానికి విచ్చేసిన యాంకర్, సినీ నటి శ్రీముఖిని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రారంభోత్సవంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ దంపతులు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ నారాయణస్వామి, సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు