‘జంబ లకిడి పంబ’ టీజర్‌ రిలీజ్ చేసిన నాని

3 May, 2018 15:52 IST|Sakshi

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై తెరకెక్కిన సినిమా జంబ లకిడి పంబ. జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను హీరో నాని గురువారం హైదరాబాద్ లో  విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో నాని  మాట్లాడుతూ - ‘ ఈవీవీగారి ‘జంబ ల‌కిడి పంబ’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే, అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది.

మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా, సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది . ఇక శ్రీనివాస్‌ రెడ్డి చేస్తే తిరుగేముంది! నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ. నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే  ‘జంబ ల‌కిడి పంబ’ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.’ అన్నారు. చిత్రయూనిట్ సమయం కేటాయించి టీజర్‌ రిలీజ్ చేసినందుకు నానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు