'శ్రియా.. ప్లీజ్‌ అతన్ని ఇబ్బంది పెట్టకు'

10 Apr, 2020 17:09 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ప్రజలంతా దాదాపు ఇళ్లకే పరిమితయిన సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారు చేసే ప్రతీ పనిని  వీడియోలు, ఫోటోల రూపంలో షేర్ చేస్తూ తమ అభిమానులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ ఈ జాబితాలో చేరారు. కాగా 2018లో శ్రియ బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొచ్చిన్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రియా ఆమె భ‌ర్త ఆండ్రీ కలిసి ర‌ష్యాలోనే ఉంటున్నారు. కాగా కరోనా నేపథ్యంలో  వీరిద్దరు ఇంట్లోనే ఉంటూ  హోమ్‌ క్వారంటైన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా శ్రియ భర్త ఆండ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కరోనా సూచనలు చేస్తున్న సైన్‌బోర్డులను షేర్‌ చేశాడు. 'ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకొండి.. సామాజిక దూరం పాటించండి' వంటి సూచ‌న‌లను శ్రియ చేయగా.. ఆమె భ‌ర్త అండ్రీ మాత్రం.. 'నన్ను ఆమె బారీ నుంచి కాపాడండి.. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది.. ఏదో ఒక ప‌ని చేయిస్తూనే ఉంది అంటూ జాలిగా ముఖం పెట్టి నెటిజన్లను అడుగుతున్నాడు. అయితే వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ 'శ్రియా..  ప్లీజ్‌ ఆండ్రీకి రోజంతా ప‌ని చెప్పి మ‌రీ ఇబ్బంది పెట్టకు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు