లాక్‌డౌన్‌లో వినూత్న కార్యక్రమం

10 Apr, 2020 17:04 IST|Sakshi

కరోనా వైరస్ అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను లాక్ డౌన్ విధించారు. తెలంగాణలోని ప్రజలను ప్రాణాలను కాపాడేందుకు పటిష్టమైన లాక్ డౌన్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలే బయటికి వచ్చే సందర్భాలు లేవు. అలాంటి సమయంలో వారాల వారీగా, నెలల వారీగా, ప్రతిరోజు మందులు వాడే వృద్దులు, వికలాంగులు, పిల్లల పరిస్థతి ఆగమ్యగోచరంగా మారిపోయింది.  ప్రజల రక్షణ, ఆరోగ్యం కాపాడడం కోసం ప్రభుత్వాలు అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. వృద్దులు, వికలాంగులు బయటకు వెళ్లలేని పరిస్థితి. మందులు ఐపోయి సమయానికి వాడకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి మీకు మేమున్నామంటూ, వారికి సహయం చేసేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందడుగు వేసింది.

 గత పది సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిర్మూలన కోసం శాంతియుతంగా పనిచేస్తున్న వైఏసి సంస్థలో యాభై వేలకు మందికి పైగా సభ్యులు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సంధర్బంగా వినూత్న కార్యక్రమం చేయాలని హైదరాబాద్ నగరంలోని సంస్థ సభ్యులు, వంద మంది యువకులు ప్రతిరోజు టూ వీలర్ వాహనాల ద్వారా మందులు అవసరం ఉన్న వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. వారికి కావలసిన మందులను తెచ్చి ఇస్తూ మందులకు అయిన బిల్లులను మాత్రమే తీసుకుంటున్నారు. ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తే ఇంటికే వెళ్లి మందులు ఇస్తున్నారు. ఈ సమయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. బయటికి వెళ్లలేని, ఓపికలేని వృద్దులు, వికలాంగులను ఈ సమయంలో మెడిసిన్ అందిస్తూ అదుకోవాలనే ఆలోచన రావడం చాలా గొప్పపరిణామమని కొనియాడుతున్నారు. 


 వృద్దులకు, వికలాంగులకు, చిన్న పిల్లలకు మందులతో పాటు ఇతర వస్తువులకు అందించేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని, కొంతమంది వృద్దులకు ఆహారాన్ని కూడా అందిస్తున్నామన్నని వైఏసి  
ఫౌండర్ పల్నాటి రాజేంద్ర తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కాల్ చేసిన స్పందిస్తూ సాధ్యమైనంత వరకు మెడిసిన్ ఇస్తూ సేవలందించనున్నామని చెప్పారు.  ప్రభుత్వాలు
లాక్ డౌన్ ఎత్తివేసే వరకు సేవలు కొనసాగుతాయన్నారు. అవసరమున్న వారు సంప్రదించాల్సిన నంబర్లు 9491114616, 8143304148, 9000042143, 9182339595, 8897736324, 7799553385
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు