లుక్‌ లీక్‌

9 Feb, 2020 00:44 IST|Sakshi
రజనీకాంత్‌

శివ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్‌. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ లుక్‌ ఒకటి బయటకు వచ్చింది. పంచె కట్టు, మెలి తిప్పిన మీసాలతో కనిపిస్తున్నారు రజనీ. లుక్‌ అదిరిందంటున్నారు ఫ్యాన్స్‌. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు