పెళ్లి కబురు చెబుతారా?

9 Nov, 2018 01:50 IST|Sakshi
రోహ్‌మన్‌ షాల్‌, సుస్మితాసేన్‌

విశ్వసుందరి సుస్మితాసేన్‌ (42) ముంబైలో ఎక్కడ  కనిపించినా ఆమె పక్కన రోహ్‌మన్‌ షాల్‌ (27) కనిపిస్తున్నారు. దీంతో సస్మిత సేన్, రోహ్‌మన్‌ కే బీచ్‌ మే కుచ్‌ కుచ్‌ హోతా హై (ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది) అనే వార్తలు బాలీవుడ్‌లో వినిపించాయి. వీటికి తగ్గట్లే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రోహ్‌మన్‌ గురించి సంబోధిస్తూ ‘లవ్‌’ అన్నారు సుస్మిత. దీంతో వీరిద్దరి లవ్‌ను కన్ఫార్మ్‌ చేశారు గాసిప్‌రాయుళ్లు. తాజాగా నలుగురు కలిసి ఉన్న ఫొటో పోస్ట్‌ చేశారు సుస్మిత. దీంతో ఈ జంట పెళ్లి ఫిక్స్‌ అంటున్నారు ఔత్సాహిక రాయుళ్లు.

‘‘ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో భాగంగా సుస్మిత, రోహ్‌మన్‌లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ పరిచయం ప్రేమగా మారింది.   సుస్మితకు రోహ్‌మన్‌ ప్రపోజ్‌ చేశా డు. ఇద్దరూ పెళ్లి గురించి చర్చించు కుంటున్నారు. సుస్మిత దత్త పుత్రికలు రినీ, అలీస్‌ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారు. అన్నీ కుదిరితే సుస్మిత వివాహం వచ్చే ఏడాది ఉండొచ్చు’’ అని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. మరి.. సుస్మిత త్వరలో పెళ్లి కబురు చెబుతారా? వెయిట్‌ అండ్‌ సీ. ఇక...1994లో విశ్వసుందరిగా నిలిచిన సుస్మితా సేన్‌ 1996–2015 మధ్యలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.


         దత్త పుత్రికలు, రోహ్‌మన్‌తో సుస్మితా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు