మార్చి మొదటికి మూత ఖాయం

4 Feb, 2018 00:59 IST|Sakshi
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్‌

డిజిటల్‌ ప్రొవైడర్‌లు వసూలు చేస్తున్న అధిక చార్జీల విషయం పై  దక్షిణాది ఫిల్మ్‌ చాంబర్‌ మెంబర్స్‌ అందరూ సమావేశమయ్యారు. ‘‘సినిమాకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు ప్రతిఫలాన్ని అందుకోకుండా మధ్యవర్తులు దోచుకోవటం అన్యాయం. ఈస్ట్‌ ఇండియా కంపెనీలాగా ఈ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు వ్యవహరిస్తున్నారు.

తక్కువ ధరకు ప్రొవైడ్‌ చేస్తున్నవారిని రానీకుండా అడ్డుకుంటున్నారు. ఒక వారంలోగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లు చర్చలకు రాకపోతే మార్చి 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోని  థియేటర్స్‌ను  మూసేయాలని నిర్ణయించాం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు