త్రీ మంకీస్‌ పైసా వసూల్‌ చిత్రం

2 Feb, 2020 01:06 IST|Sakshi
రాంప్రసాద్, సుధీర్, శ్రీను

‘జబర్దస్త్‌’ షో ద్వారా పాపులర్‌ అయిన సుధీర్, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్‌’. జి. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్‌ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్‌ చిత్రమిది’’ అన్నారు.

‘‘త్రీ మంకీస్‌’ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్‌. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌. ‘‘రిలీజ్‌ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్‌ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్‌. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ సాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు