OTT Movie: ఆరు వారాలుగా అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న సినిమా

17 Nov, 2023 18:21 IST|Sakshi

థియేటర్, ఓటీటీ.. దేని ఆడియెన్స్ దానికే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా మారిపోయింది. కొన్ని చిత్రాలు థియేటర్లో బాగా ఆడుతుంటే.. ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరికొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల సక్సెస్ అవుతున్నాయి. రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించిన హెర్ చాప్టర్ 1 (Her - Chapter 1) మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఆరు వారాలుగా అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో కొనసాగుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)

శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హెర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా నటించారు. ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ తన నటనతో ఆకట్టుకుంది. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడ్ని పోగొట్టుకున్న కేసుకి లింక్ ఉండటం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్చనకు ఎదురయ్యే సవాళ్లన్నీ కూడా ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటాయి.

రెండో పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ చాప్టర్ 1 ముగుస్తుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తీసిన దర్శకుడు శ్రీధర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ఇంటెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించిన రుహానీ శర్మపై ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ)

మరిన్ని వార్తలు