స్క్రీన్‌ టెస్ట్‌

12 Oct, 2018 05:50 IST|Sakshi

1. ‘తల్లా? పెళ్లామా?’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) బీఏ సుబ్బారావు బి) యన్టీ రామారావు సి) ఆదుర్తి సుబ్బారావు  డి) కె.కామేశ్వరరావు

2. ప్రభాస్‌ నటించిన ‘రాఘవేంద్ర’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది ఎవరు?
ఎ) ఆర్తీ అగర్వాల్‌ బి) అన్షు సి) శ్రీదేవి డి) శ్రియ

3. ‘నాలుగు స్తంభాలాట’ చిత్రానికి ప్రముఖ దర్శకులు జంధ్యాల వద్ద దర్శకత్వ శాఖలో శిష్యుడిగా చేసిన ప్రముఖ దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) కోడి రామకృష్ణ బి) ఈవీవీ సత్యనారాయణ సి) రేలంగి నరసింహారావు డి) యస్వీ కృష్ణారెడ్డి

4. ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో కథానాయిక ఎవరు? (క్లూ: ఈ చిత్రంలో హీరోగా రామ్‌ నటిస్తున్నారు)
ఎ) సాయి పల్లవి బి) నివేథా థామస్‌ సి) అనుపమా పరమేశ్వరన్‌ డి) క్యాథరిన్‌

5. శింభు హీరోగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘మన్మథ’. ఈ చిత్రంలో ఆయన సరసన ఓ హీరోయి¯Œ గా సింధుతులాని నటించారు. మరో కథానాయిక ఎవరో తెలుసా?
ఎ) జ్యోతిక  బి)  నయనతార సి) త్రిష డి) హన్సిక

6. ‘బలహీనత లేని బలవంతుణ్ణి భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు..’ డైలాగ్‌ రాసింది హను రాఘవపూడి. ఆ డైలాగ్‌ చెప్పిన హీరోఎవరు?
ఎ) శర్వానంద్‌ బి) నితిన్‌ సి) నాని  డి) అర్జున్‌

7. ఈ వారం ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌ పరంగా 40 లక్షలకు చేరుకున్న నటి ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రుతీహాసన్‌  బి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సి) సమంత  డి) పూజా హెగ్డే

8. ‘మిణుగురులు’తో మంచి చిత్రాన్ని అందించారని పలు ప్రశంసలను దక్కించుకున్నారు ఆ చిత్రదర్శకుడు అయోధ్య కుమార్‌. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు  ‘24 కిస్సెస్‌’ అనే సినిమా రూపొందింది. ఈ చిత్రంలో హీరోయిన్‌ హె బ్బా పటేల్‌. హీరోఎవరో తెలుసా?
ఎ) నవీన్‌చంద్ర బి) రాజ్‌ తరుణ్‌ సి) అరుణ్‌ అదిత్‌  డి) రాహుల్‌ రవీంద్ర

9. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘తిరుడా తిరుడి’ (తెలుగులో ‘దొంగ దొంగ’) మూవీకి కథను అందించిందెవరో తెలుసా?
ఎ) జేడీ చక్రవర్తి బి) ఇ. నివాస్‌ సి) శేఖర్‌ కపూర్‌ డి) రామ్‌ గోపాల్‌వర్మ

10. పదేళ్ల క్రితం నటుడు నానా పటేకర్‌ తనను వేధించాడంటూ వార్తల్లోకెక్కిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) కంగనా రనౌత్‌  బి) మల్లికా శెరావత్‌ సి) తనుశ్రీ దత్తా  డి) రాధికా ఆప్టే

11. మలయాళ సినిమా ‘మన్యం పులి’లో నటించి, మెప్పించిన హీరో ఎవరో తెలుసా?
ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్‌ సి) సురేశ్‌ గోపి డి) జయరాం

12. ‘అమ్మోరు’ చిత్రం అనగానే నటి సౌందర్య గుర్తుకు వస్తారు. ఆ చిత్రంలో అమ్మవారి పాత్రను పోషించిన నటి ఎవరో కనుక్కోండి?
 ఎ) వాణీ విశ్వనాథ్‌  బి) సుకన్య  సి) రమ్యకృష్ణ డి) ప్రేమ

13 అక్టోబర్‌ 10న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్, కమెడియన్‌ అలీల పుట్టినరోజు. అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ దర్శకుడెవరో తెలుసా?
ఎ) శ్రీను వైట్ల  బి) యస్‌.యస్‌. రాజమౌళి సి) వీవీ వినాయక్‌ డి) పూరీ జగన్నాథ్‌

14. ‘మనీ’ చిత్రంలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ పాత్రలో జీవించిన ప్రముఖ నటుడెవరు?
ఎ) బ్రహ్మానందం బి) జయప్రకాశ్‌ రెడ్డి సి) తనికెళ్ల భరణి డి) శుభలేఖ సుధాకర్‌

15 కళాతపస్వి కె.విశ్వనాథ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘విశ్వదర్శనం’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా?
ఎ) ఇంద్రగంటి మోహన కృష్ణ  బి) జనార్థన మహర్షి సి) దశరథ్‌  డి) అవసరాల శ్రీనివాస్‌

16. జగపతిబాబు హీరోగా నటించిన ఓ చిత్రానికి ఆరు నంది అవార్డులు వచ్చాయి. ఆ సినిమా పేరేంటి?
ఎ) ఆహా బి) గాయం సి) ఆహ్వానం డి) శుభాకాంక్షలు

17 ‘‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...’ ఈ పాట ‘క్రిమినల్‌’ చిత్రంలోనిది. ఈ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా?
ఎ) ^è క్రవర్తి బి) యం. యం. శ్రీలేఖ సి) ఏఆర్‌ రెహమాన్‌
డి) యం.యం. కీరవాణి

18. ‘ఖలేజా’ చిత్రంలోని ‘సదాశివ సన్యాసి తాపసీ కైలాసవాసి...’ పాట రచయితెవరో తెలుసా?
ఎ) సిరిÐð న్నెల బి) చంద్రబోస్‌ సి) సుద్ధాల అశోక్‌తేజ  డి) రామజోగయ్య శాస్త్రి

19. ఈ ఫొటోలోని నటుడెవరు?
ఎ) ఆమిర్‌ ఖాన్‌ బి) హృతిక్‌ రోషన్‌ సి) సల్మాన్‌ ఖాన్‌ డి) షారుక్‌ ఖాన్‌

20. యన్టీఆర్, చిరంజీవి నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) జ్వాలా బి) చట్టానికి కళ్లులేవు సి) తిరుగులేని మనిషి  డి) ఎదురులేని మనిషి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) బి 3) బి 4) సి 5) ఎ 6) బి ్చ7) డి 8) సి 9) డి 10) సి 11) బి 
12) సి 13) బి 14) ఎ 15) బి 16) బి 17) డి 18) డి 19) ఎ 20) సి

నిర్వహణ: శివ మల్లాల

మరిన్ని వార్తలు