హీరో నిఖిల్‌ పెళ్లి ఫిక్స్‌!

7 Aug, 2017 20:52 IST|Sakshi
హీరో నిఖిల్‌ పెళ్లి ఫిక్స్‌!

టాలీవుడ్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో హీరో నిఖిల్‌ ఒకరు. బ్యాచిలర్‌ జీవితానికి బైబై చెప్పేయాలని నిఖిల్‌ భావిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తన దగ్గర బంధువుల అమ్మాయిని నిఖిల్‌ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, నిఖిల్‌ పరిణయం చేసుకోబోయే అమ్మాయి ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్‌ కుమార్తె అని చెబుతున్నారు.

ఈ నెల 24న నిశ్చితార్థం, అక్టోబరు తొలి వారంలో వివాహం ఇరువురికి వివాహం జరగనుందట. అయితే ఈ వార్తను నిఖిల్‌, ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించాల్సి ఉంది. నిఖిల్‌ ప్రస్తుతం ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.