Sushmita Sen: ఆ ఉద్దేశం ఉంటే తప్పకుండా చేసుకుంటా: సుస్మితా సేన్

19 Nov, 2023 07:51 IST|Sakshi

బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య -3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌ను రామ్ మాధ్వని దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీతో తన ప్రేమయాణం గురించి నోరు విప్పింది.

(ఇది చదవండి: కావాలయ్యా సాంగ్‌.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు)

మీకు లలిత్‌ మోడీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ప్రశ్నించగా?..'నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా ప్రయత్నించను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. తనపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు వాస్తవాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మన నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.' అని అన్నారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. వీరిద్దరూ 2022లో  బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

మరిన్ని వార్తలు