టీవీ నటి ముక్కుకు సర్జరీ!

27 Dec, 2016 11:20 IST|Sakshi
టీవీ నటి ముక్కుకు సర్జరీ!

లాస్‌ ఏంజిల్స్‌: ప్రముఖ టీవీ నటి కిమ్‌ కర్దాషియాన్‌పై పారిస్‌లో దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన అనంతరం ఆమె ఎక్కువగా వార్తల్లో ఉండటం మానేశారు. పబ్లిక్‌ ఈవెంట్లకు కాస్త దూరంగానే ఉంటున్నారు. తాజాగా క్రిస‍్మస్‌ ఈవ్‌ పార‍్టీలో కనిపించిన ఈ అమ్మడుపై సోషల్‌ మీడియాలో కామెంట్లు మళ్లీ గుప్పుమన్నాయి.

పార్టీలో గోల్డెన్‌ డ్రెస్‌లో కర్దాషియాన్‌ తళుక్కుమన్నా.. అభిమానులు మాత్రం ఆమె ముక్కునే ఎక్కువగా పరిశీలిస్తున్నారు. చెల్లి కోలే కర్దాషియాన్‌తో కలిసి ఉన్న వీడియోలో కిమ్‌ ముక్కులో చాలా మార్పు ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు కొంచెం మందంగా ఆమె జాతి మూలాలకు దగ్గరగా ఉన్న ముక్కు ఇప‍్పుడు 'రీనో ప్లాస్టీ' మూలంగా మరీ సన్నగా మారిందని అంటున్నారు. కాస్మొటిక్‌ సర్జన్‌ టీజే ఈషో దీనిపై మాట్లాడుతూ.. సర్జరీ రిజల్ట్‌ బాగుందన్నారు. గతంలోనూ పలుమార్లు కిమ్‌పై ఇలాంటి వార్తలు వచ్చాయి.