వరుణ్ క్లాస్.. హరిప్రియ మాస్...

3 Aug, 2013 01:29 IST|Sakshi
వరుణ్ క్లాస్.. హరిప్రియ మాస్...
 ‘‘మోహన్‌బాబుగారి కాంబినేషన్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌లో  ఈ చిత్రం పాటలను చూపించాను. అందరూ బాగున్నాయని మెచ్చుకున్నారు. శేఖర్‌చంద్రస్వరపరచిన పాటలు, సాయి రాసిన పంచ్ డైలాగులు ఈ సినిమాకి ఎస్సెట్ అవుతాయి’’ అన్నారు వరుణ్ సందేశ్. కోనేటి శ్రీను దర్శకత్వంలో వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ చిత్రం నేడు విడుదలవుతోంది. 
 
 ఈ నేపథ్యంలో పాటలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ‘‘ఈ చిత్రంలో మాస్ పాత్రకు అడగ్గానే చేయగలనా అనిపించింది. అందుకే వర్క్‌షాప్ కూడా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హరిప్రియ చెప్పారు. 
 
 ‘‘హాలీవుడ్ మూవీ ‘ప్రెట్టి ఉమన్’ చూసినప్పుడు ఈ కథ తట్టిందని, ఎన్నో సమస్యలను అధిగమించి చేసిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా రషెస్ చూసినవాళ్లు ‘వేదం’ సినిమా గుర్తొస్తోందని చెప్పడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. ఇది పైసా వసూల్ సినిమా అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు.