ఆ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్‌ దేవరకొండ

16 Dec, 2019 19:43 IST|Sakshi

తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్‌ పెంచుకున్న విజయ్‌ అమ్మాయిల మనసులో తిష్ట వేశాడు. అతని క్రేజ్‌ టాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇటు దక్షిణాదితో నుంచి అటు ఉత్తరాదికీ పాకింది. ఇక ఈ మధ్య విజయ్‌ సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడినప్పటికీ ఆయన నిర్మాతగా మారిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా మంచి విజయాన్నే అందించింది. తాజాగా ఈ యువహీరో టాలీవుడ్‌ స్టార్స్‌ను వెనక్కునెట్టి ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అధికమంది ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోగా విజయ్‌ తన పేరు లిఖించుకున్నాడు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు 3.8, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 4.6, ప్రభాస్‌ 4 మిలియన్ల ఫాలోవర్లను వెనక్కు నెట్టి 5 మిలియన్ల ఫాలోవర్స్‌తో విజయ్‌ దేవరకొండ మొదటి స్థానంలో నిలిచాడు. కాగా ప్రస్తుతం విజయ్‌ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ప్రేమికులకు గిఫ్ట్‌గా ‘వాలంటైన్స్‌ డే’ నాడు రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన విజయ్‌ ఫస్ట్‌లుక్‌ ‘సీరియస్‌ లవర్‌’గా ఆకట్టుకుంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

సినిమా

ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రో చెప్పేసిన విక్కీ

పవన్‌ కల్యాణ్‌ను నిలబెట్టిన చిత్రం..

కూతురి శ్ర‌ద్ధాంజ‌లి.. ఓ తండ్రి ఆవేద‌న‌

‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

ఆ బికినీ ఫొటోకు అంత ఎడిటింగ్ ఎందుకు?

చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నా: హీరోయిన్‌