యంగ్‌ డైరెక్టర్‌తో అజిత్‌ కొత్త సినిమా

1 Mar, 2018 16:14 IST|Sakshi
అజిత్‌ కుమార్‌

కోలీవుడ్ టాప్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వాసం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన అజిత్‌, శివలు విశ్వాసంతో మరో హిట్ మీద కన్నేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీదకు వెళ్లకుండా అజిత్ తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం అజిత్‌ తన తదుపరి చిత్రాన్ని ఓ యువ దర్శకుడితో చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

శతురంగ వెట్టై, శతురంగ వెట్టై 2, ధీరన్ అధిగరం ఒండ్రు సినిమాలతో సత్తా చాటిన యువ దర్శకుడు హెచ్‌ వినోద్‌ దర్శకత‍్వంలో నటించేందుకు అజిత్‌ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వినోద్ తన తొలి సినిమా రిలీజ్ తరువాత అజిత్‌ తో సినిమా చేసేందుకు ప్రయత్నించినా వర్క్‌ అవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి అజిత్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు విజయ్‌ 63వ సినిమాకు కూడా వినోద్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్‌

క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి..

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

సినిమా

కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్‌

క్వారంటైన్‌ లైఫ్‌.. చేతికొచ్చిన పంట మాదిరి..

వైరల్‌: మంచు లక్ష్మీని టార్గెట్‌ చేసిన ఆర్‌జీవీ!

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను